Page Loader
శిఖర్ ధావన్ కు ఎండ్ కార్డ్  పడినట్లేనా..?
భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్

శిఖర్ ధావన్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2022
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

గత శతాబ్ది కాలంగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే క్రికెట్లో ఉత్తమ ఆటగాడిగా కొనసాగుస్తున్నాడు. టీమిండియాను విజయాల బాటలో నడిపించిన రోహిత్, కోహ్లీ తరువాత శిఖర్ ధావన్ అని చెప్పొచ్చు. మంగళవారం శ్రీలంక సిరీస్ తో ప్రకటించిన వన్డే జట్టులో శిఖర్ ధావన్ కు చోటు దక్కకపోవడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లంకతో టీ20లకు దూరంగా ఉన్న రోహిత్‌, కోహ్లి, రాహుల్‌ వన్డేల్లో మాత్రం ఆడనున్నారు. రోహిత్‌ సారథ్యంలోని జట్టుకు హార్దిక్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కెఎస్ రాహుల్ వైస్ కెప్టెన్సీ కోల్పోయాడు.

శిఖర్ ధావన్

'మిస్ గబ్బర్.. ఇన్నాళ్లుమాకు వినోదాన్ని పంచావు'

భవిష్యతులో శిఖర్ ధావన్ క్రికెట్ గ్రౌండ్లో‌ తొడగొడుతూ, మీసం తిప్పే సన్నివేశాలకు ఇక చూడలేం అని ఆయన అభిమానులు మదన పడుతున్నాడు. టీమిండియా జెర్సీలో ఇక చూసే ఆదృష్టం దక్కదేమోనని అర్థమవుతోంది. థ్యాంకు గబ్బర్.. ఇన్నాళ్లు మాకు వినోదాన్ని పంచావు అంటూ పలువురు ఫ్యాన్స్ ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు. టీ 20లకు ఎప్పుడో దూరమైనా శిఖర్ ధావన్, కొన్ని సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించారు. బంగ్లాదేశ్‌ సిరీస్‌లో విఫలమైన శిఖర్‌పై సెలక్టర్లు వేటు వేశారు.