LOADING...
Robin Uthappa: ఇదే చివరి ఐపీఎల్? ధోని రిటైర్మెంట్‌పై రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు!
ఇదే చివరి ఐపీఎల్? ధోని రిటైర్మెంట్‌పై రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు!

Robin Uthappa: ఇదే చివరి ఐపీఎల్? ధోని రిటైర్మెంట్‌పై రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2026
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ 2026 సీజన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ మొదలుకావడానికి ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోని భవిష్యత్తుకు సంబంధించిన ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సీజన్‌తో ధోని ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు చెప్పవచ్చనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉత‌ప్ప‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో ధోని కేవలం ఆటగాడిగానే కాకుండా 'మెంటర్-కమ్-ప్లేయర్'గా కూడా వ్యవహరించే అవకాశముందని తెలిపాడు.

Details

ఈసారి ఎనిమిదో స్థానంలో దిగే అవకాశం 

మరోవైపు సంజు శాంస‌న్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ మాజీ కెప్టెన్‌గా ఉండి చైన్నై సూప‌ర్ కింగ్స్ లో రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపైనా ఉతప్ప స్పందించాడు. ఈ సీజన్‌లో ధోని తన పాత్రను మరింత తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఆయన, ఈసారి ఎనిమిదో స్థానంలో దిగే అవకాశముంది. తన వీడ్కోలు సమయం దగ్గరపడిందని ధోనికి తెలుసు. అందుకే తన నీడ నుంచి బయటపడి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ తన సొంత ముద్ర వేసేలా అవకాశం ఇవ్వాలని చూస్తారని ఉతప్ప పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2026 సీజన్ తొలి దశ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది.

Details

మార్చి 28న ఐపీఎల్ 19వ ఎడిషన్

దేశంలోని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. ఎన్నికల తేదీలు వెల్లడైన తర్వాత ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఐపీఎల్ 19వ ఎడిషన్ తొలి దశ మార్చి 28న ప్రారంభమై ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుంది. ప్రారంభ మ్యాచ్ బెంగళూరులోని ఎం.చిన్న‌స్వామి స్డేడియంలో జరుగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ మధ్య జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది

Advertisement