Page Loader
ధోని చూస్తుండగా వారెవ్వా అనిపించిన ఇషాన్ కిషన్
బ్రాస్‌వెల్‌ను రనౌట్ చేసిన ఇషాన్ కిషన్

ధోని చూస్తుండగా వారెవ్వా అనిపించిన ఇషాన్ కిషన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2023
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాంచి వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించింది. 177 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ఇండియా.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అయితే బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ లో మెరిశాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సమక్షంలో చక్కటి రనౌట్ తో అకట్టుకున్నాడు. మైఖేల్ బ్రేస్‌వెల్‌ను ఒక అద్భుతమైన డైరెక్ట్ హిట్ రనౌట్ చేశాడు. ప్రస్తుతం ఈ రనౌట్ వీడియో సోషల్ మీడియా వైరల్ కావడంతో ఇషాన్ కిషన్ ను ఉద్ధేశించి అభిమానులు నయా మహేంద్ర సింగ్ ధోని అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇషాన్ కిషన్

డైరెక్ట్ హిట్‌తో బ్రాస్‌వెల్‌ను ఔట్ చేసిన ఇషాన్

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 18 ఓవర్లో డారిల్ మిచెల్ బంతిని సరిగ్గా కొట్టలేకపోయాడు. వెంటనే బంతి కీపర్ వైపు వెళ్లింది. దీంతో పరుగు కోసం డారిల్ మిచెల్ ముందుకెళ్లాడు. వెంటనే నాన్ స్ట్రైక్ ఎండ్ లో బ్రేస్ వెల్ పరుగు కోసం వేగంగా పరిగెత్తాడు. దీంతో వెంటనే బంతిని అందుకున్న ఇషాన్ కిషన్ డైరెక్ట్ హిట్‌తో బ్రేస్ వెల్ ను రనౌట్ చేశారు. మ్యాచ్ చూడటానికి మైదానంలోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని, ఇషాన్ కిషన్ చేసిన రనౌట్ చూసి అశ్చర్యపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తరఫున వాషింగ్టన్ సుందర్ 28 బంతుల్లో 50 పరుగులు చేసిన తన మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.