ఇషాంత్ శర్మ అసభ్య పదజాలం వాడాడు.. ధోని రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది: కమ్రాన్ అక్మల్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ క్రికెట్లో టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ హైల్టోట్ మ్యాచును తిలకించడానికి క్రికెట్ ఫ్యాన్స్ అతృతుగా ఎదురుచూస్తుంటారు. కొన్నిసార్లు ఇరు జట్ల ఆటగాళ్లు సహనం కోల్పోయి మాటల యుద్ధానికి దిగుతుంటారు.
అలాంటి ఘటనే 2012-13 సీజన్‌లో బెంగళూర్ వేదికగా టీ20 మ్యాచులో చోటు చేసుకుంది.
అప్పట్లో ఇషాంత్ శర్మ, పాక్ మాజీ కీపర్ కమ్రాన్ అక్మల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు దూసుకురావడంతో ఆ వివాదం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది.
తాజాగా ఈ ఘటనపై కమ్రాన్ అక్మల్ స్పందించాడు.
Details
ఈ ఘటన వల్ల రెండు మ్యాచులకు దూరం
తమ ఇద్దరి మధ్య గొడవ ఎక్కువ కావడంతో ఎంఎస్ ధోని, సురేష్ రైనా కలుగజేసుకొని ఇరువురిని శాంతింపజేశారని, అంతటితో ఆ గొడవకు పుల్ స్టాప్ పడిందని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు.
ఇషాంత్ శర్మ అసభ్య పదజాలం వాడటంతో తాను కూడా ఓ అసభ్య పదం వాడానని, అయితే పరిస్థితి సీరియస్ గా మారుతున్నప్పుడు ఎంఎస్ ధోని, సురేన్ రైనా వచ్చి గొడవకు ముగింపు పలికారని కమ్రాన్ అక్మల్ వివరించాడు.
ఈ ఘటన వల్ల తాను రెండు మ్యాచుల నిషేధంతో పాటు భారీగా మ్యాచ్ ఫీజులో కోత విధించారన్నారు.