Page Loader
కుల్దీప్‌ను పక్కన పెట్టడం.. నమ్మశక్యంగా లేదు : గవాస్కర్‌
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్

కుల్దీప్‌ను పక్కన పెట్టడం.. నమ్మశక్యంగా లేదు : గవాస్కర్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2022
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ జట్టులో స్థానం కోల్పోవడం పెద్ద సవాల్.. మళ్లీ జట్టులో స్థానం సంపాదించడం అంత తేలికమైన విషయం కాదు.. భారత్ క్రికెట్ జట్టులో ఇది మరింత కష్టమని చెప్పొచ్చు. అయితే రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించారు. కుల్దీప్ మొదటి టెస్టులో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో ఎనిమిది వికెట్లు తీసి, 40 పరుగులు చేశాడు. ఈ నిర్ణయాన్ని నమ్మశక్యం కాదని వ్యాఖ్యానించాడు. నేను చాలా బలమైన పదాలను ఉపయోగించాలనుకుంటున్నాను, కానీ 20 వికెట్లలో ఎనిమిది వికెట్లు తీసిన కుల్దీప్ ను పక్కన పెట్టడం సరైంది కాదన్నారు.

ఇండియా

కుల్దీప్‌కు చోటు కల్పించకపోవడం దురదృష్టకరం

కుల్దీప్ మార్చి 2021 తర్వాత మొదటిసారిగా భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అతను మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లలో 5/40, 3/73తో అద్భుతంగా రాణించాడు. ఇటువంటి అద్భుత ప్రదర్శన చేసిన కుల్దీప్ ఎందుకు మ్యాచ్ నుంచి తప్పించారని గవాస్కర్ ప్రశ్నించారు. కుల్‌దీప్ ఇప్పటివరకు భారత జట్టు కోసం ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 14 ఇన్నింగ్స్‌లో ఐదు సార్లు నాలుగు కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. టెస్టు మ్యాచ్‌లలో ప్రతి ఆరు ఓవర్లకు కనీసం ఒక వికెట్ చొప్పున అతడు తీశాడు. అటు కెప్టెన్ కేఎల్ రాహుల్, కోచ్ రాహుల్ ద్రావిడ్‌లు తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేసినా ఫలితం లేకుండా పోయింది.