Travis Head: ట్రావిస్ హెడ్ లేకపోవడం బాధగా ఉంది.. ఎస్ఆర్‌హెచ్ కోచ్ వెటోరి కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2027 (IPL 2027) రిటెన్షన్ జాబితా విడుదలైన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తీసుకున్న ఓ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను (Travis Head) జట్టు నుంచి రిలీజ్ చేస్తున్నట్లు ఎస్ఆర్‌హెచ్ ప్రకటించింది. తన అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌ను బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ సీజన్‌లో ఆడలేనని హెడ్ ముందుగానే ఫ్రాంచైజీకి చెప్పినట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయం వెనుక అసలు కారణం వేరే ఉండొచ్చని భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వివరాలు
హెడ్ ముందే ఊహించి తప్పుకున్నాడా?
తన యూట్యూబ్ ఛానెల్‌లో వివిధ ఐపీఎల్ జట్ల రిటెన్షన్ నిర్ణయాలపై మాట్లాడిన శ్రీకాంత్.. ట్రావిస్ హెడ్ వ్యవహారంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
నిజానికి ఎస్ఆర్‌హెచ్ ఎలాగూ హెడ్‌ను రిటైన్ చేసుకునే ఆలోచనలో లేదేమో! వాళ్లు తనను జట్టు నుంచి రిలీజ్ చేస్తారని హెడ్ ముందే పసిగట్టి ఉండొచ్చు.
ఆ భయంతోనే, వాళ్లు తీసేయకముందే తానే స్వయంగా ఐపీఎల్ 2027 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఉంటాడు" అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
కాగా 2024 వేలంలో రూ.6.8 కోట్లకు ట్రావిస్ హెడ్‌ను హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2025 వేలానికి ముందు ఏకంగా రూ.14 కోట్లు చెల్లించి అతడిని రిటైన్ చేసుకుంది.
వివరాలు
హెడ్ అందుబాటుపై వెటోరి నిరాశ
మరోవైపు, ట్రావిస్ హెడ్ నిర్ణయంపై సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరి (Daniel Vettori) నిరాశ వ్యక్తం చేశాడు.
జియోస్టార్ (JioStar) నిర్వహించిన 'ఐపీఎల్ 2027 రిటెన్షన్ స్పెషల్' కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఈసారి రిటెన్షన్ నిర్ణయాల్లో ఆటగాళ్ల అందుబాటు కీలక పాత్ర పోషించిందని స్పష్టం చేశాడు.
ప్రస్తుత సైకిల్‌లో ఇది చివరి ఏడాది కావడంతో, గత సీజన్‌లో అద్భుతంగా ఆడిన కోర్ టీమ్‌ను కొనసాగించాలని భావించామని వెటోరి వివరించాడు.
అయితే కొందరు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేదా అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని తెలిపాడు.
వివరాలు
గత మూడేళ్ల సేవలకు కృతజ్ఞతలు
మూడేళ్లుగా సన్‌రైజర్స్ విజయాల్లో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడని వెటోరి గుర్తు చేసుకున్నాడు.
రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా తరఫున అతడికి చాలా ముఖ్యమైన సిరీస్‌లు ఉన్నాయని, అందుకే దేశానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని వివరించాడు.
ఈసారి హెడ్ తమ జట్టుతో లేకపోవడం బాధగా ఉందని, అయినప్పటికీ గత మూడేళ్లుగా ఎస్ఆర్‌హెచ్‌కు అతడు అందించిన సేవలకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటామని వెటోరి పేర్కొన్నాడు.
ఈ మేరకు జియోస్టార్ విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించాడు.