Dhanashree Verma: 'నిందించడం సులభమే'.. విడాకుల ప్రచారంపై ధనశ్రీ మరో పోస్టు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల చాహల్ తన స్నేహితురాలితో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించడం నెట్టింట చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ స్టోరీ ఆసక్తి రేపుతోంది.
'మహిళలను నిందించడం ఎప్పుడూ ఫ్యాషనే' అంటూ ఆమె పేర్కొంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్‌వశ్‌తో కలిసి చాహల్ వీక్షించాడు.
దీనిని ఉద్దేశించే ధనశ్రీ ఈ పోస్ట్ పెట్టారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే విడాకుల వార్తల నేపథ్యంలో తనపై జరుగుతున్న ట్రోల్స్‌కు ధనశ్రీ ఈ విధంగా స్పందించిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Details
ధనశ్రీ, చాహల్ కేసుపై తుది విచారణ పూర్తి
చాహల్, ధనశ్రీ 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంట సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండగా, గతంలో పెట్టిన కొన్ని పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి.
ఒకరినొకరు అన్‌ఫాలో అవడం, అలాగే ధనశ్రీ తన పేరు నుంచి 'చాహల్' పదాన్ని తీసివేయడంతో విడాకులపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఇటీవల, ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో వీరి విడాకుల కేసుపై తుది విచారణ పూర్తయినట్లు కథనాలు వెలువడ్డాయి.
ధనశ్రీ భరణంగా రూ.60 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే, ఈ వార్తలపై ధనశ్రీ న్యాయవాది స్పందించారు.
న్యాయపరమైన వ్యవహారంపై ఇప్పుడే మాట్లాడటం సరికాదని, ఇది కోర్టు పరిధిలో ఉందన్నారు. కథనాలు రాసేముందు వాస్తవాలను తెలుసుకోవాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకూడదని స్పష్టం చేశారు.