LOADING...
Shreyas Iyer: అర్హత ఉన్నా జట్టులోకి తీసుకోకపోతే అసహనం సహజం : శ్రేయస్ అయ్యర్
అర్హత ఉన్నా జట్టులోకి తీసుకోకపోతే అసహనం సహజం : శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer: అర్హత ఉన్నా జట్టులోకి తీసుకోకపోతే అసహనం సహజం : శ్రేయస్ అయ్యర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2025
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన మనసులోని మాటలను బహిరంగంగా చెప్పాడు. తుది జట్టులో ఆడే అర్హత ఉన్నా, కనీసం జట్టులోకి కూడా ఎంపిక చేయకపోతే ఏ ఆటగాడైనా నిరాశకు గురవుతాడని ఆయన స్పష్టం చేశాడు. ఒకప్పుడు వన్డేల్లో కీలక ఆటగాడిగా నిలిచిన శ్రేయస్‌కు ఏడాదికి పైగా టెస్టు జట్టులో చోటు లేదు. అలాగే, టీ20ల్లో ఆయన ఆడింది రెండేళ్ల క్రితమే. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు ఆయనను ఎంపిక చేయని సెలక్టర్లు, తాజాగా ఆసియా కప్‌ టీ20 టోర్నీ జట్టులోనూ శ్రేయస్‌ను పక్కన పెట్టారు. ఈ పరిస్థితుల మధ్య, శ్రేయస్ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ జట్టులో లేదా తుది 11మందిలో ఉండటానికి అర్హత ఉన్నా మనల్ని ఎంపిక చేయకపోతే అసహనం కలుగుతుంది.

Details

నిలకడగా రాణించాలి

కానీ అదే సమయంలో మనకు దక్కిన ప్రతి అవకాశంలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి. నిలకడగా రాణిస్తూ, ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకు విజయాన్ని అందించాలి. మన పని నైతికతతో సాగాలి. ఎవరో చూస్తున్నారని మాత్రమే పని చేయడం సరికాదు. మనపై ఎవరూ దృష్టి పెట్టకపోయినా కష్టపడి, నిబద్ధతతో కొనసాగడం ముఖ్యమని అన్నాడు. అలాగే ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలో తన ప్రదర్శనను గుర్తుచేసుకున్నాడు. ఆ టోర్నీలో తాను నిలకడగా రాణించి, జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించానని, ఆ గెలుపు తన కెరీర్‌లో అత్యంత మధురమైన జ్ఞాపకమని శ్రేయస్ వ్యాఖ్యానించాడు.