Ishan Kishan:'అప్పట్లో జోకులే.. ఇప్పుడు క్రికెట్ పైనే ఫోకస్'.. ఇషాన్ కిషన్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈనెల 15న కొలంబోలోని ఆర్.ప్రేమచంద్రయ్య వేదికగా టీమిండియా, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ప్రత్యేక యాక్షన్‌తో బౌలింగ్ చేస్తున్న పాకిస్థాన్ బౌలర్ ఉ ఉస్మాన్ తారిఖ్‌పై అందరి దృష్టి నిలిచింది. అయితే అతడిని ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని టీమ్ ఇండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ స్పష్టం చేశాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్ అనంతరం విలేకర్లతో మాట్లాడిన ఇషాన్, "ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి మేం ముందుగానే ప్రిపేర్ అయ్యాం. బంతిని బాగా గమనిస్తూ మా సహజ ఆట ఆడాల్సిన సమయం వచ్చింది. స్కోర్‌బోర్డ్‌పై మంచి టోటల్ ఉంచాలనుకుంటున్నామని చెప్పారు.
Details
మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది
అతడి బౌలింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు చూసి మాకు స్పష్టమైన అవగాహన వచ్చిందని తెలిపాడు. ఇషాన్ మాట్లాడుతూ న్యూజిలాండ్ సిరీస్ తమకు ఎంతో ఉపయుక్తమైందని చెప్పాడు. న్యూజిలాండ్ జట్టు మ్యాచ్‌ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని, ఆ సిరీస్ తమలో విశ్వాసాన్ని పెంచిందని వెల్లడించాడు. బ్యాటర్లకు పరుగులు చేయడం ఎప్పుడూ మంచిదే. గత సిరీస్ నుంచి మేం మంచి ఫామ్‌లో ఉన్నాం. న్యూజిలాండ్ మ్యాచ్‌లు మాకు మంచి పాఠాలు నేర్పాయి. ఆ సిరీస్ తర్వాత మా ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని వివరించాడు.
Details
నా ఆటపైనే ఇప్పుడు పూర్తి ఫోకస్
వ్యక్తిగతంగా తాను కూడా మారిపోయానని ఇషాన్ చెప్పాడు. "నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు మారిపోయిన వ్యక్తిని అనుకుంటున్నాను. నాకు జోకులు అంటే చాలా ఇష్టం. గతంలో 24 గంటలు జోక్స్‌తోనే కాలక్షేపం చేసేవాడిని. కానీ ఇప్పుడు ఆ సమయాన్ని రెండు, మూడు గంటలకు మాత్రమే పరిమితం చేశాను. ప్రస్తుతం నా బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాను. ఇది జట్టుకూ, నాకూ ఉపయోగపడుతుంది. క్రికెట్ తర్వాతే మిగతావన్నీ అని ఇషాన్ కిషన్ స్పష్టం చేశాడు.