జడేజా ఆ విషయంలో హర్టయ్యాడేమో : సీఎస్కే సీఈఓ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ ఆలౌ రౌండర్ రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని వారసుడిగా పేరు సంపాదించుకున్నాడు. చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా జడేజా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసి చైన్నైకి ట్రోఫీని అందించాడు.
అయితే రవీంద్ర జడేజా పెట్టిన ఓ పోస్టు కారణంగా చివరికి ధోని అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ధోనీ, జడేజా మధ్య విబేధాలున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా చైన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందించాడు.
ధోనీ, జడేజా మధ్య ఎలాంటి విబేధాలు లేవని, అయితే జడేజా ఔట్ కోసం ధోనీ అభిమానులు ప్రార్థిస్తుంటారని, ఆ విషయం జడేజాను బాధపెట్టి ఉండొచ్చని అతను వెల్లడించారు.
Details
జడేజా ఒక్కసారి కూడా కంప్లైట్ చేయలేదు
రవీంద్ర జడేజా మ్యాచ్ ముగింపు సమయంలో క్రీజులోకి వస్తాడని, అతను వచ్చిన సమయంలో 7, 8 బంతులు మాత్రమే మిగిలి ఉంటాయని, అతని తర్వాత ధోని బ్యాటింగ్ కు వస్తాడన్న విషయం జడేజాకు తెలుసు అని, దీంతో జడేజా తొందరగా ఔట్ అయితే ధోని వస్తాడని అభిమానులు నినాదాలు చేస్తారని కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.
ఈ ఒక్క విషయంలో జడేజా మనసు గాయపడి ఉంటుందని, అలాంటి సమయంలో ఏ అటగాడు అయినా ఫీల్ అవుతాడని, అయితే జడేజా మాత్రం ఒక్కసారి కూడా ఈ విషయంపై తమకు కంప్లైట్ చేయలేదని చెప్పుకొచ్చాడు.
జడేజా ఐపీఎల్‌లో విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత ధోని ఏకంగా జడేజాను ఎత్తుకొని ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.