Ravindra Jadeja: జడేజా టెస్టులకు రిటైర్మెంట్?ఇన్‌స్టాలో సంచలన పోస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో టెస్ట్ జెర్సీని షేర్ చేసిన తర్వాత, అభిమానులు, క్రికెట్ నిపుణులు ఆయన రిటైర్మెంట్ గురించి అంచనా వేస్తున్నారు.
ఈ సందర్భంలో కొంతమంది యూజర్లు "ఇది రిటైర్మెంట్‌కు సంకేతం?" అంటూ ప్రశ్నించారు. గతేడాది టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత, జడేజా టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
ప్రస్తుతం వన్డే,, టెస్టు క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.
అయితే ఆస్ట్రేలియా పర్యటనలో ఫామ్ లేని కారణంగా జడేజాపై విమర్శలు వచ్చాయి. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భారత జట్టు 1-3 తేడాతో ఓటమి పాలైంది.
Details
ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్ ట్రోఫీ
జడేజా ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచుల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు, 27 సగటుతో 135 పరుగులు చేశాడు.
జడేజా ప్రదర్శనపై సెలెక్టర్లు దృష్టి సారించారని, బీసీసీఐ త్వరలో జడేజా భవిష్యత్ గురించి చర్చలు జరపవచ్చని సమాచారం ఉంది.
జడేజా ఇకపై టెస్టుల్లో కొనసాగడం కష్టమని సూచిస్తున్నాయి. భారత జట్టు ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టీ20, మూడు వన్డేలు ఆడనుంది.
అలాగే ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుంది.
ఇంకా, ఇంగ్లండ్ సిరీస్ మరియు చాంపియన్స్ ట్రోఫీ కోసం జడేజాను ఎంపిక చేయాలని లేదా యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని సెలెక్టర్లు చర్చిస్తున్నట్లు సమాచారం.