
Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా టెస్టు కెప్టెన్సీపై తాజాగా ప్రముఖ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .
ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో టెస్టు కెప్టెన్సీ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్లనున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో ఆసక్తికరమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అశ్విన్ మాట్లాడుతూ, టెస్టు కెప్టెన్సీ బాధ్యతలకై యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్, స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా పేర్లు వినిపిస్తున్నప్పటికీ, తన దృష్టిలో రవీంద్ర జడేజానే సరైన ఎంపిక అని అన్నాడు.
ఇది నా వైల్డ్ కార్డ్ ఎంపిక. జడేజా అత్యంత అనుభవం కలిగిన ఆటగాడు.
Details
కనీసం రెండేళ్ల పాటు ఇవ్వాలి
అతనికి కనీసం రెండేళ్లపాటు కెప్టెన్సీ ఇచ్చి, ఓ యువ కెప్టెన్‌ను అదే సమయంలో వైస్ కెప్టెన్‌గా నియమించి శిక్షణ ఇవ్వాలని అశ్విన్ సూచించారు.
ఇంతేకాకుండా గిల్‌పై అభిమానం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా అతనికి కెప్టెన్సీ ఇవ్వడం సరైంది కాదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
శుభ్‌మన్ గిల్ అద్భుతమైన బ్యాటర్. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో రాంచీ, ధర్మశాల టెస్టుల్లో అద్భుతంగా ఆడాడు. కానీ టెస్టు కెప్టెన్సీకి దేశవాళీ క్రికెట్‌పై దృష్టి ఉండాలి.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది అన్నదానిపై అవగాహన ఉండాలి. ఒక్క ఐపీఎల్ సీజన్ ద్వారా కెప్టెన్సీ నిర్ణయించకూడదని స్పష్టం చేశాడు.
Details
ఈ నెల చివర్లో టెస్టు జట్టు ప్రకటన
గుజరాత్ టైటన్స్ ప్రదర్శనపై కూడా అశ్విన్ స్పందించాడు.
ఈ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉందని, అలాంటప్పుడు గిల్ కెప్టెన్సీ అవకాశాలకు మరింత బలమొస్తుందని అన్నాడు.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌లో పర్యటించే టీమిండియా టెస్టు జట్టును ఈ నెల చివర్లో ప్రకటించే అవకాశం ఉంది.
తాజా పరిణామాల నేపథ్యంలో జడేజా కెప్టెన్సీకి అశ్విన్ మద్దతు తెలిపిన విషయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.