టీమిండియా కిట్ స్పాన్సర్ గా అడిడాస్.. స్పష్టం చేసిన జైషా
ప్రముఖ జర్మన్ కంపెనీ అడిడాస్ ఇక నుంచి టీమిండియా కిట్ స్పానర్ గా ఉండనుంది. క్రీడా సంబంధిత వస్తువులు ఉత్పత్తి చేసే అడిడాస్ తో తాము జతకట్టుతున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా ధృవీకరించారు. ఈ ఒప్పందం వచ్చే జూన్ 1 నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు. అయితే ఎంపీఎల్ స్పోర్ట్స్ 2020 నుంచి 2023 డిసెంబర్ వరకు టీమిండియా కిట్ స్పాన్సర్ గా వ్యవరించాల్సి ఉండగా.. ఆ సంస్థ గతేడాది తప్పుకుంది. అంతకుముందు 2016 నుంచి 2020 వరకు నైక్ సంస్థ టీమిండియా కిట్ స్పాన్సర్ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అడిడాస్ తో డీల్ ఓకే కావడంతో మరో అంతర్జాతీయ సంస్థ టీమిండియా జెర్సీల్లో కనపడనుంది.
ఐదేళ్ల పాటు స్పాన్సర్ గా అడిడాస్
కిట్ స్పాన్సర్ గా తాము అడిడాస్ ఒప్పందం కుదుర్చుకున్నామని, అడిడాస్ తో డీల్ కుదరడం సంతోషంగా ఉందని కార్యదర్శి జైషా వెల్లడించారు. అయితే క్రికెట్ అభిృవృద్ధికి తాము నిరంతరం కష్టపడతామని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రముఖ క్రీడా దుస్తుల బ్రాండ్ లలో ఒకటైన అడిడాస్ తో కలిసి పని చేయడం ఉత్సాహంగా ఉందని, వెలకమ్ అడిడాస్ అంటూ జైషా ట్విట్ చేశాడు. 2023 నుంచి 2028 వరకు టీమిండియా కిట్ స్పాన్సర్ గా అడిడాస్ వ్యవహరించనుంది. దీని కోసం ఒక్క మ్యాచ్ కు రూ.75 లక్షలు, ఏడాదికి 70 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది.