IND Vs AUS: జైస్వాల్-కోహ్లీ జోరు.. ఆస్ట్రేలియాకు ముందు భారీ లక్ష్యం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్‌లోని అక్టోపస్ స్టేడియంలో మొదటి టెస్టులో టీమిండియా దుమ్ము దులిపింది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 150 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాను 104 పరుగులకే చాపచుట్టించారు. ఇది టీమిండియాకు స్వల్ప ఆధిక్యాన్ని అందించింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడారు. ఇద్దరూ కలసి తొలి వికెట్‌కు 201 పరుగుల భారీ భాగస్వామ్యం అందించడంతో టీమిండియా పటిష్ట స్థితిలోకి చేరుకుంది.
శతకం బాదిన విరాట్ కోహ్లీ
జైస్వాల్ 161 పరుగులతో తన నాలుగో టెస్ట్ సెంచరీ నమోదు చేస్తే, కెప్టెన్ విరాట్ కోహ్లీ 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మరోసారి తన సత్తా చాటాడు. చివరికి టీమిండియా 487 పరుగుల వద్ద ఆరు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది, ఆస్ట్రేలియాకు గెలవడానికి భారీ 533 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.