LOADING...
WPL 2026 : హాఫ్ సెంచరీతో చెలరేగిన జెమీయా.. ముంబైపై దిల్లీ ఘన విజయం
హాఫ్ సెంచరీతో చెలరేగిన జెమీయా.. ముంబైపై దిల్లీ ఘన విజయం

WPL 2026 : హాఫ్ సెంచరీతో చెలరేగిన జెమీయా.. ముంబైపై దిల్లీ ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2026
11:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ 2026 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ తమ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబయి ఇండియన్స్‌పై ఏడు వికెట్ల తేడాతో దిల్లీ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ అజేయంగా 51 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చగా, లీజెల్లె లీ 46 పరుగులు, షఫాలీ వర్మ 26 పరుగులతో కీలకంగా రాణించారు.

Advertisement