SA vs WI: అరుదైన మైలురాయిని అందుకున్న జాసన్ హోల్డర్
ఈ వార్తాకథనం ఏంటి
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో జాసన్ హోల్డర్ అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. టెస్టులో 2500 పరుగులు, 150 వికెట్లు తీసిన ఆటగాడిగా జాసన్ హోల్డర్ చరిత్రకెక్కాడు.
దిగ్గజ ఆటగాడు గ్యారీ సోబర్స్ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న రెండో వెస్టిండీస్ ఆటగాడిగా నిలిచాడు. తొలి టెస్టులో కీగన్ పీటర్‌సన్ వికెట్ తీసి 150 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
హోల్డర్ టెస్టులో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడు. రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్ లతో సమానంగా ఆడగలే నైపుణ్యం హోల్డర్‌కు ఉంది.
హోల్డర్
హోల్డర్ సాధించిన రికార్డులివే
టెస్టులో 150 వికెట్లు తీసిన 15వ వెస్టిండీస్ బౌలర్ గా నిలిచాడు. టెస్టులో వెస్టిండీస్ ఆటగాళ్లలో కేమర్ రోచ్ 256 వికెట్లు, షానన్ గాబ్రియెల్ 163 వికెట్లు తీసి హోల్డర్ కంటే ముందు ఉన్నారు.
హోల్డర్ ఇప్పటివరకూ టెస్టుల్లో 28.86 సగటుతో 2,626 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి. ఇందులో ఒక డబుల్ సెంచరీ ఉండడం కూడా గమనార్హం.
సెంచూరియన్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా 342 పరుగులు చేసింది, ఓపెనర్ ఐడెన్ మార్క్రామ్ 115 పరుగులతో రాణించాడు. అల్జారీ జోసెఫ్ 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.