Page Loader
Jasprit Bumrah: 400 వికెట్లు తీసిన 6వ భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా.. ఈ ఘనత సాధించిన భారత బౌలర్లు ఎవరంటే?
400 వికెట్లు తీసిన 6వ భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah: 400 వికెట్లు తీసిన 6వ భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా.. ఈ ఘనత సాధించిన భారత బౌలర్లు ఎవరంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 20, 2024
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

చెపాక్ వేదికగా భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తూ బంగ్లాదేశ్ బ్యాటర్లను వరుసగా పెవిలియన్‌కు పంపించారు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ షద్మాన్‌ను కళ్లు చెదిరే ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేసిన జస్ప్రీత్ బుమ్రా, టీ బ్రేక్‌ సమయానికి మొత్తం మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన క్రికెట్‌ కెరీర్‌లో కీలక మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌ల్లో 400 వికెట్లు పూర్తి చేసిన టాప్-10 భారత బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. అలాగే, అత్యధిక వికెట్లు సాధించిన ఆరవ భారత పేసర్‌గా రికార్డు సృష్టించాడు.

వివరాలు 

ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో 19 వికెట్లు 

ఈ ఫీట్‌ను బుమ్రా బంగ్లాదేశ్ బ్యాటర్ హసన్ మహమూద్‌ను ఔట్‌ చేయడం ద్వారా సాధించాడు. 227 ఇన్నింగ్స్‌లలో బుమ్రా 162 టెస్ట్ వికెట్లు, 149 వన్డే వికెట్లు, 89 టీ20 వికెట్లు సాధించి ఈ ఘనతను అందుకున్నాడు. అతను ఇప్పటికే భారత క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన అగ్రగామి బౌలర్లు అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ సరసన చేరాడు. 2018లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన బుమ్రా, సుదీర్ఘ ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శనలను కొనసాగిస్తూ అన్ని ఫార్మాట్‌లలో ఆటగాడిగా తనకంటూ ప్రత్యేకతను సృష్టించాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 19 వికెట్లు సాధించి మరొక రికార్డు సృష్టించాడు.

వివరాలు 

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు భారత బౌలర్లు 

అనిల్‌ కుంబ్లే - 953 వికెట్లు ఆర్‌.అశ్విన్‌ - 744 వికెట్లు హర్భజన్‌సింగ్‌ - 707 వికెట్లు కపిల్‌దేవ్‌ - 687 వికెట్లు జహీర్‌ఖాన్‌- 597 వికెట్లు రవీంద్ర జడేజా - 570 వికెట్లు జవగళ్‌ శ్రీనాథ్‌ - 551 వికెట్లు మహ్మద్‌ షమీ - 448 వికెట్లు ఇషాంత్‌ శర్మ - 434 వికెట్లు జస్పీత్‌ బూమ్రా - 400* వికెట్లు