LOADING...
Jasprit Bumrah: అరుదైన ఘ‌న‌త సాధించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఏకైక పేస‌ర్‌.. 
భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఏకైక పేస‌ర్‌..

Jasprit Bumrah: అరుదైన ఘ‌న‌త సాధించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఏకైక పేస‌ర్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను అందుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో మూడు ఫార్మాట్లలో.. టెస్టులు,వన్డేలు,టీ20ల్లో.. 50కి పైగా మ్యాచ్‌లు ఆడిన ఏకైక పేసర్‌గా బుమ్రా కొత్త రికార్డు సృష్టించాడు. శుక్రవారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో తుది జట్టులో స్థానం దక్కించుకోవడం ద్వారా ఆయన ఈ విశిష్ట గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 31 ఏళ్ల వయస్సు కలిగిన బుమ్రా ఇప్పటివరకు టీమిండియా తరఫున 50 టెస్టులు, 89 వన్డేలు, 75 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. టెస్టుల్లో 222 వికెట్లు, వన్డేల్లో 149 వికెట్లు, టీ20ల్లో 96 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

వివరాలు 

టీమ్ఇండియా త‌రుపున మూడు ఫార్మాట్ల‌లో 50కి పైగా మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాళ్లు వీరే.. 

ఇక మూడు ఫార్మాట్లలో 50కి పైగా మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో బుమ్రా చేరికతో మరో పేరు చేరింది. ఈ జాబితాలో ముందుగా ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ - 123 టెస్టులు, 302 వ‌న్డేలు, 125 టీ20 మ్యాచ్‌లు (మొత్తంగా 550 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు) ఎంఎస్ ధోని - 90 టెస్టులు, 350 వ‌న్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు (మొత్తం 538 మ్యాచ్‌లు) రోహిత్ శ‌ర్మ - 67 టెస్టులు, 237 వ‌న్డేలు, 159 టీ20 మ్యాచ్‌లు (మొత్తం 499 మ్యాచ్‌లు)

వివరాలు 

టీమ్ఇండియా త‌రుపున మూడు ఫార్మాట్ల‌లో 50కి పైగా మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాళ్లు వీరే.. 

ర‌వీంద్ర జ‌డేజా - 86 టెస్టులు, 204 వ‌న్డేలు, 74 టీ20 మ్యాచ్‌లు (మొత్తం 364 మ్యాచ్‌లు) ర‌విచంద్ర‌న్ అశ్విన్ - 106 టెస్టులు, 116 వ‌న్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు (మొత్తం 287 మ్యాచ్‌లు) జ‌స్‌ప్రీత్ బుమ్రా - 50 టెస్టులు, 89 వ‌న్డేలు, 75 టీ20 మ్యాచ్‌లు (మొత్తంగా 214 మ్యాచ్‌లు)