ICC Rankings: జస్ప్రీత్ బుమ్రాకు ఎదురుదెబ్బ.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బౌలర్‌గా రబాడ
దక్షిణాఫ్రికా పేసర్ కసిగో రబాడ ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రబాడ, బంగ్లాదేశ్‌తో జరిగిన మిర్పూర్ టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు తీసి తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకున్నారు. అదే విధంగా 300 టెస్ట్ వికెట్ల మైలురాయిని చేరాడు. ఈ ప్రదర్శనతో రబాడ మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 2018 తర్వాత మళ్లీ టాప్ ర్యాంక్‌ను సాధించిన రబాడ, గతంలో 2019లో నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రెండో స్థానంలో ఉన్న హే మూడో స్థానానికి పడిపోయాడు. 846 పాయింట్లతో ఉన్న బుమ్రా, రెండు స్థానాలు దిగజారాడు.
అశ్విన్
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఐదో స్థానంలో నిలిచాడు. వెటరన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. నోమన్ అలీ తొలిసారిగా టాప్-10లోకి ఎంట్రీ ఇచ్చిన పాకిస్తాన్ స్పిన్నర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన నోమన్, ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. భారత యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ బ్యాటింగ్ విభాగంలో మూడో స్థానానికి చేరి భారత బ్యాటర్లలో టాప్-10లో ఉన్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం నెంబర్ వన్ బ్యాటర్‌గా ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ కొనసాగుతున్నాడు.