Page Loader
అడ్వర్టైజింగ్‌ ఎక్స్‌పెండిచర్‌లో చరిత్ర సృష్టించిన జియో సినిమా
జియో సినిమా

అడ్వర్టైజింగ్‌ ఎక్స్‌పెండిచర్‌లో చరిత్ర సృష్టించిన జియో సినిమా

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2023
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ జియో సినిమా మొదటి ఐదు వారాల్లో 1300 కోట్ల వ్యూస్ సాధించి ఇప్పటికే ఆల్ టైం రికార్డును సృష్టించింది. అభిమానుల కోసం ప్రత్యేకంగా జియో సినిమా 360 డిగ్రీ వ్యూవింగ్ ఫీచర్ ను కూడా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అడ్వర్టైజింగ్‌ ఎక్స్‌పెండిచర్‌లో రికార్డు సృష్టిస్తోంది. మొత్తం AdExలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ వాటాను ఇప్పుడు కలిగి ఉంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ప్లాట్‌ఫారమ్ యావరేజ్‌ కాన్‌కరెన్సీ రేటు గతఏడాదితో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగడం విశేషం. ఇంతవరకూ ఏ క్రీడా టోర్నిలో లేని విధంగా IPL డిజిటల్ స్ట్రీమింగ్ సమయంలో స్పాన్సర్‌ల సంఖ్య రికార్డుస్థాయిలో 26కి చేరుకొని చరిత్ర సృష్టించింది.

Details

జియో సినిమా ఇన్నోవేషన్స్ పై ప్రశంసలు

జియో సినిమా ఇన్నోవేషన్స్ పై టాటా మోటర్స్ ఈవీ చీఫ్ మార్కెటింగ్ అధికారి వివేక్ శ్రీ వత్స ప్రశంసలు కురిపించాడు. ప్రీ యాక్సిస్, 4k స్ట్రీమింగ్, మల్టీక్యామ్, మల్టిపుల్-లాంగ్వేజ్ ఆప్షన్ తో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. భారతదేశం అంతటా IPL వీక్షకులకు జియోసినిమా CTV ప్లాట్‌ఫారమ్ గో-టు ప్లాట్‌ఫారమ్‌గా మారిందని జాక్వార్ గ్రూప్ జనరల్ మేనేజర్, హెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ సందీప్ శుక్లా ప్రశంసించారు. మీడియా పార్టనర్స్ ఆసియా ప్రకారం ఈ సీజన్ లో 550 డాలర్ల ఆదాయాన్ని చేరుకోవచ్చని అంచనా వేసింది. డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ లు 60శాతం వాటాను స్వాధీనం చేసుకుంటాయని వెల్లడించింది.