Page Loader
జియో సినిమా ఆల్ టైం రికార్డు.. 5వారాల్లో 1300 కోట్లకు పైగా వ్యూస్
అల్ టైం రికార్డు సృష్టించిన జియో సినిమా

జియో సినిమా ఆల్ టైం రికార్డు.. 5వారాల్లో 1300 కోట్లకు పైగా వ్యూస్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 11, 2023
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత ఐపీఎల్ 16వ సీజన్ లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సీజన్ ముగింపు దశకు వచ్చినా ఫ్లేఆఫ్స్ బెర్త్ కి దాదాపు అన్ని జట్లు రేసులో ఉన్నాయంటే.. మ్యాచ్ లు ఎంత ఉత్కంఠం జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ లేకుండా మ్యాచ్ లను ఉచితంగా చూడటానికి టాటా ఐపీఎల్ 2023 అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ జియో సినిమా అవకాశం కల్పించింది. ప్రస్తుతం జియో సినిమా డిజిటల్ స్పోర్ట్స్ వ్యూవింగ్ వరల్డ్ లో కొత్త స్డాండర్డ్స్ ను నమోదు చేసింది. మొదటి ఐదు వారాల్లో జియో సినిమా 1300 కోట్లు వ్యూస్ సాధించి ఆల్ టైం రికార్డును సృష్టించింది. జియోసినిమా విజయంపై Viacom18 Sports CEO అనిల్ జయరాజ్ సంతోషం వ్యక్తం చేశారు.

Details

జియో సినిమాతో చేతులు కలిపిన సచిన్, ధోని

జియో సినిమా ఐదురోజుల్లోనే అత్యధిక మంది వ్యూవర్లు మ్యాచ్ చూసి రికార్డును రెండు సార్లు బ్రేక్ చేయడం విశేషం. అభిమానుల కోసం ప్రత్యేకంగా జియో సినిమా 360 డిగ్రీ వ్యూవింగ్ ఫీచర్ ను కూడా లాంచ్ చేసింది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, ఫాఫ్ డు ప్లెసిస్, రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్ వంటి స్టార్‌ ప్లేయర్స్‌ ఇంటర్వ్యూలు జియో సినిమాలో హైలెట్ గా నిలిచాయి. జియో సినిమా మొత్తం 26 టాప్‌ బ్రాండ్‌లను ఆకర్షించడం గమనార్హం. సచిన్, ఎంఎస్ ధోని, సూర్యకుమార్ యాదవ్, స్మృతి మంధాన టాటా ఐపీఎల్ ను విస్తరించేందుకు జియో సినిమాతో చేతులు కలిపారు.