LOADING...
IND vs SA : ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు.. మ‌హేంద్ర సింగ్ ధోని రికార్డును స‌మం చేసిన జితేశ్ శ‌ర్మ‌ 
మ‌హేంద్ర సింగ్ ధోని రికార్డును స‌మం చేసిన జితేశ్ శ‌ర్మ

IND vs SA : ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు.. మ‌హేంద్ర సింగ్ ధోని రికార్డును స‌మం చేసిన జితేశ్ శ‌ర్మ‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వదేశంలో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లను అందించే రికార్డు మ‌హేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డును భారత్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ సమం చేశాడు. ఈ ఘనతను అతను మంగళవారం కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో సాధించాడు. జితేశ్ శర్మ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెర్రీరా, కేశవ్ మహారాజ్‌ల క్యాచ్‌లను అందించాడు. నిజానికి, ధోని కూడా ఇదే ఫీట్‌ను 2017లో కటక్‌లో శ్రీలంక పై చేసిన మ్యాచ్‌లో సాధించాడు.

వివరాలు 

టీ20ల్లో భార‌త్ త‌రుపున ఓ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక వికెట్ల‌లో పాలు పంచుకున్న కీప‌ర్లు వీరే.. 

ఆ సమయంలో ధోని నలుగురు బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసాడు,అందులో రెండు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్‌లు ఉన్నాయి. అయితే, ఓవర్‌ఆల్‌గా భారత్ తరపున టీ20లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌ల రికార్డు ఇప్పటికీ ధోని పేరు మీదే ఉంది. ధోని 2018లో ఇంగ్లాండ్ పై బ్రిస్టల్ వేదికలో ఓ ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు తీసి ఈ రికార్డును సాధించాడు. ఎంఎస్ ధోని - 2018లో ఇంగ్లాండ్ పై 5 క్యాచ్‌లు (బ్రిస్ట‌ల్) ఎంఎస్ ధోని - 2010లో అఫ్గానిస్తాన్ పై 4 క్యాచ్‌లు (సెయింట్ లూయిస్) ఎంఎస్ ధోని - 2017లో శ్రీలంక‌పై 4 ఔట్‌లు (రెండు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్‌లు) (క‌ట‌క్)

వివరాలు 

 101 పరుగుల తేడాతో భారత్ విజయం 

దినేశ్ కార్తీక్ - 2022లో ఇంగ్లాండ్ పై 4 ఔట్‌లు (3 క్యాచ్‌లు, 1 స్టంపింగ్) (సౌతాంప్ట‌న్‌) జితేశ్ శ‌ర్మ‌ - 2025లో ద‌క్షిణాఫ్రికా పై 4 క్యాచ్‌లు (క‌ట‌క్‌) ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా (59 నాటౌట్; 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ఆటతో అర్థశతకం బాదడంతో, మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్‌లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 176 పరుగుల లక్ష్యానికి చేరుకునే ప్రయత్నంలో 12.3 ఓవర్‌లలో కేవలం 74 పరుగులకే ఆలౌటైపోయింది. ఇలాగే భారత్ 101 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి చేరుకుంది.

Advertisement