జోస్ బట్లర్ వల్లే స్వేచ్ఛగా అడుతున్నా: యశస్వీ జైస్వాల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంతో యువ ఆటగాళ్లు ప్రతిభను చాటుతున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లే తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. బౌలింగ్, అటు బ్యాటింగ్ విభాగాల్లో యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వీ జైస్వాల్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఐపీఎల్‌లో చక్కగా రాణిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ విజయంలో అతను కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఐపీఎల్ లో మూడు మ్యాచ్ లు ఆడిన యశస్వీ జైస్వాల్ 125 తో సత్తా చాటాడు. తన ఐపీఎల్ లో బాగా రాణిస్తుండటం వెనుక జోస్ బట్లర్ పాత్ర ఎంతో ఉందని యశస్వీ జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
ఫిట్ నెస్ పై ఎక్కువ దృష్టి పెట్టాను : యశస్వీ జైస్వాల్
జోస్ బట్లర్ సహకారం వల్లే ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్నానని యశస్వీ జైస్వాల్ పేర్కొన్నారు. పవర్ ప్లే లో ముఖ్యంగా పరుగులు రాబట్టడానికి అతనే కారణమని చెప్పాడు. చక్కని టెక్నిక్ షాట్లు ఆడితే పరుగులొస్తాయని బట్లర్ ఇదే విషయాన్ని తనకు చెప్పాడని వెల్లడించారు. మైదానంలో కాకుండా బయట కూడా జోస్ బట్లర్ చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని, భిన్నమైన పరిస్థితుల్లో ఎలాంటి షాట్లు ఎంపిక చేసుకోవాలో తెలుసుకున్నానని, ఇంకా ఆటపైనా కాకుండా ఫిటెనెస్ పైనా కూడా ఎక్కువ దృష్టి పెట్టానని యశస్వీ జైస్వాల్ వివరించారు. ఇక ఏప్రిల్ 16న రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.