Jos Buttler: టీ20ల్లో క్రిస్ గేల్‌ను దాటేసిన జోస్ బట్లర్.. కొత్త రికార్డు సృష్టించిన ఇంగ్లండ్ స్టార్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లాండ్ వికెట్‌కీపర్-బ్యాటర్ జోస్ బట్లర్ (Jos Buttler) టీ20 క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌ను అధిగమించి రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం 'ది హండ్రెడ్ 2026' టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బట్లర్.. లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో తన మొత్తం టీ20 పరుగులను 14,572కు చేర్చుకుని, 14,562 పరుగులు చేసిన క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే వెస్టిండీస్ స్టార్ కీరన్ పొలార్డ్, క్రిస్ గేల్‌ను అధిగమించి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
వివరాలు
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
ఇప్పుడు బట్లర్ రెండో స్థానంలో నిలవడంతో గేల్ మూడో స్థానానికి పడిపోయాడు.
కీరన్ పొలార్డ్ - 14,803 పరుగులు (663 ఇన్నింగ్స్)
జోస్ బట్లర్ - 14,572 పరుగులు (487 ఇన్నింగ్స్)
క్రిస్ గేల్ - 14,562 పరుగులు (455 ఇన్నింగ్స్)
అలెక్స్ హేల్స్ - 14,449 పరుగులు (523 ఇన్నింగ్స్)
డేవిడ్ వార్నర్ - 14,284 పరుగులు (438 ఇన్నింగ్స్)
విరాట్ కోహ్లీ - 14,218 పరుగులు (413 ఇన్నింగ్స్)