ICC Mens T20 World Cup: జోష్ హాజిల్‌వుడ్ ఔట్.. స్టీవ్ స్మిత్ ఇన్.. ఆసీస్ జట్టులో కీలక మార్పు!
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ తుది జట్టులో ఒక ముఖ్యమైన మార్పు చోటుచేసుకుంది. గాయపడిన పేసర్ జోష్ హాజిల్‌వుడ్ స్థానంలో స్టీవ్ స్మిత్‌ను జట్టులోకి చేర్చారు. గాయం కారణంగా హేజిల్‌వుడ్ ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే, తొలుత స్టీవ్ స్మిత్‌కు ఆసీస్ స్క్వాడ్‌లో స్థానం దక్కలేదు. అయితే జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయపడటంతో అతని స్థానంలో స్మిత్ జట్టులోకి వచ్చాడు. మార్ష్ ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
Details
జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి
ప్రస్తుతం ఆయన కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. స్టీవ్ స్మిత్ గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే ఈ ఫార్మాట్‌లో దేశవాళీ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరగనున్న మ్యాచ్ ఆసీస్‌కు అత్యంత కీలకం. ఈ పోరులో గెలిస్తేనే ఆస్ట్రేలియా సూపర్-8 దశకు అర్హత సాధించే అవకాశం ఉంది.