హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కేన్ విలియమ్సన్
న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో 41వ హాఫ్ సెంచరీని నమోదు చేశారు. 100 బంతుల్లో 10 ఫోర్లతో 85 పరుగులు చేశారు. విలియమ్సన్ రెండో వికెట్‌కు ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి 181 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫిన్ అలెన్ ఔట్ అయిన తర్వాత విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. అనంతరం డెనాల్ కాన్వేతో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. మరో వికెట్ పడకుండా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఇద్దరు కలిసి 180 పరుగులు చేశాడు. అనంతరం విలియమ్సన్ 35వ ఓవర్‌లో మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
6500 పరుగుల మైలురాయిని దాటిన విలియమ్సన్
ఒక దశలో 183/1తో దూసుకెళ్తున్న న్యూజిలాండ్ 261 పరుగులకే ఆలౌట్ అయ్యారు. విలియమ్సన్ 6500 పరుగుల మైలురాయిని దాటి సత్తా చాటాడు. 167 మ్యాచ్ లో 47.80 సగటుతో 6501 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 41 అర్ధసెంచరీలు ఉన్నాయి. రాస్ టేలర్ (8,607), స్టీఫెన్ ఫ్లెమింగ్ (8,037), మార్టిన్ గప్టిల్ (7,346), నాథన్ ఆస్టిల్ (7,090) పరుగులు చేశారు. వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా విలియమ్సన్ చరిత్రకెక్కాడు.