ఒక బంతి ఆడకుండానే ఐపీఎల్‌కు దూరమైన కేన్ విలియమ్సన్..!
ఐపీఎల్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న గుజరాత్ టైటాన్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఐపీఎల్‌లో ఒక బంతిని కూడా ఆడకుండానే కేన్ విలియమ్సన్ ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్లు తెలుస్తోంది. చైన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సిక్సర్‌ను కాపాడే ప్రయత్నంలో కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సీజన్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. 13 ఓవర్లలో జోషువా వేసిన బంతిని సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విలియమ్సన్ గాల్లోకి ఎగిరి దాన్ని అందుకోవడానికి ట్రై చేశాడు. తాను బ్యాలెన్స్ తప్పానని గ్రహించిన కేన్.. బంతిని మైదానంలోకి విసిరి రెండు పరుగులను సేవ్ చేశాడు.
విలియమ్సన్ గాయంపై స్పందించిన హార్ధిక్ పాండ్యా
బంతిని ఆపే క్రమంలో మోకాలు నేలకు బలంగా ఢీకొట్టింది. దీంతో నొప్పితో విలియమ్సన్ విలవిలలాడాడు. దీంతో సహాచర ఆటగాళ్ల సాయంతో మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ స్థానంలో సాయి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. అనంతరం విలియమ్సన్ గాయంపై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా స్పందించాడు. అతనికి మోకాలికి స్కానింగ్ చేశారని, వైద్యుల పరీక్షీంచిన తర్వాత గాయంపై మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని, కేన్ విలియమ్సన్ త్వరగా కోలుకోవాలని హార్ధిక్ ఆకాంక్షించాడు. ఐపీఎల్ 2023 వేలంలో విలియమ్సన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ రూ. కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.