Page Loader
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే విజృంభించిన శుభ్‌మాన్ గిల్
36 బంతుల్లో 63 పరుగులు చేసిన శుభ్‌మాన్ గిల్

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే విజృంభించిన శుభ్‌మాన్ గిల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 01, 2023
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ విజృంభించాడు. చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 36 బంతుల్లో 63 పరుగులు చేసి చెలరేగాడు. మొదట బ్యాటింగ్ చేసిన చైన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. చైన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 92 పరుగులు సత్తా చాటాడు. లక్ష్య చేధనకు దిగిన డిఫెండింగ్ ఛాంపియన్స్ 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. శుభ్‌మాన్ గిల్ ఐపీఎల్‌లో తన 15వ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అదే విధంగా గుజరాత్ టైటాన్స్ తరుపున 500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.

శుబ్‌మాన్ గిల్

సిఎస్కే పై 3 అర్ధ సెంచరీలు చేసిన గిల్

ఇప్పటివరకూ 75 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన గిల్ 32.72 సగటుతో 1,963 పరుగులు చేశాడు. గిల్ సీఎస్క్‌పై 25.90 సగటుతో 259 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు పూర్తి చేశాడు. గైక్వాడ్ తన భారీ షాట్లతో సీఎస్కే స్కోరును పరిగెత్తించాడు. ఈ దశలో మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ వికెట్లు కోల్పోవడంతో సీఎస్కే కష్టాల్లో పడింది. అనంతరం గైక్వాడ్, అంబటి రాయుడుతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నించారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా 50 పరుగులు పైగా జోడించారు. లక్ష్య చేధనలో గుజరాత్ కు శుభారంభం అందింది. సహా 16 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా గుజరాత్‌కు విజయాన్ని అందించారు.