వన్డే వరల్డ్ కప్ 2023కి కేన్ విలియమ్సన్ సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్ 16వ సీజన్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు నెలలు ఆటకు దూరమైన అతను, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు.
ఐపీఎల్ ఆరంభ మ్యాచులో కుడి మోకాలులోని యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ దెబ్బతినడంతో ఆటకు దూరం కావాల్సి వచ్చింది.
ప్రస్తుతం స్వదేశంలో ఉన్న అతను వన్డే వరల్డ్ కప్ లోపు ఫిటెనెస్ సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. తాజాగా అతను జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వరల్డ్ కప్-2023 లోపు జట్టులోకి తిరిగి వచ్చేందుకు ప్రస్తుతం విలియమ్సన్ కసరత్తులు చేస్తున్నారు.
Details
గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న కేన్ విలియమ్సన్
గతంలో ఇలాంటి పెద్ద గాయం తనకు కాలేదని, గాయంతో ఎక్కువ రోజులు ఆటకు దూరమైన వాళ్లతో మాట్లాడుతున్నానని, వారం నుంచి వారానికి ఎంతో కొంత మెరుగవ్వడానికి ప్రయత్నిస్తున్నానని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.
వన్డే వరల్డ్ కప్‌లో కేన్ విలియమ్సన్ సారథ్యంలో న్యూజిలాండ్ 2015, 2019లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముఖ్యంగా 2021 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాను ఓడించి టెస్టు ఛాంపియన్ షిప్ గదను సొంతం చేసుకుంది.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ కు విలియమ్సన్ ఫిట్ నెస్ సాధిస్తాడో లేదో మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.