ఐపీఎల్ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్.. అతని స్థానంలో ఎవరు..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లోనే చైన్నై సూపర్ కింగ్స్‌ను మట్టి కరిపించింది. అయితే గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైన్నై సూపర్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయం తీవ్రత కారణంగా మొత్తం ఐపీఎల్ సీజన్‌కు కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ముగ్గురు ప్లేయర్లు రేసులో ఉన్నారు. డేవిడ్ మలన్, ట్రావిస్ హెడ్, జాసన్ రాయ్‌తో కేన్ విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం భావిస్తోంది.
ఈ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేస్తారో
డేవిడ్ మిలన్ ఇంగ్లాండ్ తరుపున టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఎడమచేతి వాటం బ్యాటర్ మలన్ టీ20ల్లో 58 మ్యాచ్ లు ఆడి 37.71 సగటుతో 1810 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 15 హాఫ్ సెంచరీలున్నాయి. ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్ కీలక ఆటగాడు. తన విధ్వంకర బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా ఉంది. జాసన్ రాయ్ ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్‌లో తానెంటో నిరూపించుకున్నాడు. అతను 2023 వేలానికి ముందు గుజరాత్ నుంచి తప్పుకున్నారు. రాయ్ 13 గేమ్‌లలో 29.91 సగటుతో 329 పరుగులు చేశారు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ఈ ముగ్గరిలోని గుజరాత్ టైటాన్స్ ఎవరిని ఎంపిక చేస్తుందో వేచి చూడాల్సిందే.