Page Loader
Kangana Ranaut: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌నకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కంగన రనౌత్‌
ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌నకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కంగన రనౌత్‌

Kangana Ranaut: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌నకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కంగన రనౌత్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటి,లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు భారత్‌లో నిర్వహించనున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహించనున్నారు. ఈ పోటీలో 100కి పైగా దేశాల నుంచి అథ్లెట్లు పాల్గొనబోతున్నారు.ఈ సందర్భంగా కంగన రనౌత్ మాట్లాడుతూ.."భారత పారా అథ్లెట్లు ప్రతి రోజు చరిత్రను సృష్టిస్తున్నారు.వారికి మద్దతు ఇవ్వడం, పారా క్రీడల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంలో భాగస్వామ్యం కావడం నాకు గౌరవంగా భావిస్తున్నాను.పారా క్రీడలు అంటే కేవలం విజయాల కోసం పోటీ పడటం మాత్రమే కాదు,అది ధైర్యం, ధృఢ సంకల్పం, అసాధ్యాన్ని సాధించగల శక్తికి నిదర్శనం. ఇటువంటి ఛాంపియన్లకు నా మద్దతు ఉండటం నా జీవితంలో గర్వకారణం" అని అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండియా పారాలింపిక్ కమిటీ చేసిన ట్వీట్