
ZIM vs SA : దక్షిణాఫ్రికా స్పిన్నర్లలో కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత సాధించాడు. ప్రత్యర్థి బ్యాటర్ క్రెయిగ్ ఎర్విన్‌ను ఔట్ చేయడం ద్వారా టెస్టు ఫార్మాట్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇది టెస్టుల్లో 200 వికెట్లు సాధించిన తొలి దక్షిణాఫ్రికా స్పిన్నర్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. 2016లో వాకా స్టేడియంలో ఆస్ట్రేలియాతో టెస్టు అరంగేట్రం చేసిన మహారాజ్ ఇప్పటివరకు 59 టెస్టుల్లో 202 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనతతో సఫారీ స్పిన్నర్లలో అగ్రస్థానానికి చేరాడు. అతనికి తర్వాత అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్లు టేఫీల్డ్ (170), పాల్ ఆడమ్స్ (134), పాల్ హ్యారిస్ (103), నికీ బోయే (100) ఉన్నారు.
Details
దక్షిణాఫ్రికా టెస్టు స్పిన్నర్ల వికెట్ల గణాంకాలు
కేశవ్ మహారాజ్ - 202 వికెట్లు హ్యూ టేఫీల్డ్ - 170 వికెట్లు పాల్ ఆడమ్స్ - 134 వికెట్లు పాల్ హ్యారిస్ - 103 వికెట్లు నికీ బోయే - 100 వికెట్లు ఓవర్ఆల్గా సఫారీ బౌలర్ల టాప్ లిస్టు ఈ విభాగంలో టెస్టు ఫార్మాట్లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు సాధించిన డేల్ స్టెయిన్ 439 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతనికి అనుసరించి షాన్ పొలాక్ (421), మకాయా ఎంటిని (390), కగిసో రబాడ (336), అలన్ డొనాల్డ్ (330), మోర్నే మోర్కెల్ (309), జాక్వెస్ కల్లిస్ (291) నిలిచారు.
Details
తొలి ఇన్నింగ్స్ లో 167 పరుగుల అధిక్యం
మ్యాచ్ విషయానికొస్తే, రెండో రోజు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. టోనీ డి జోర్జీ (22), వియాన్ ముల్డర్ (25) క్రీజులో నిలిచారు. ప్రస్తుతం సఫారీలు 216 పరుగుల మెరుగైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంతకుముందు, దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 418 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకే ఆలౌట్ కావడంతో సఫారీలకు 167 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.