LOADING...
ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్
ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్

ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025-2027 వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (WTC) ప్రారంభ సిరీస్‌గా మారనున్న ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌కి టీమిండియా అత్యంత ప్రాధాన్యమిస్తోంది. అయితే ఈ సిరీస్‌కి ముందు సీనియర్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో జట్టుకు అది గట్టి షాకే అయింది. దీంతో యువ ఆటగాళ్లకు అవకాశాలు అందుతున్నాయి. శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో యంగ్‌ జట్టు ఇంగ్లాండ్‌ గడ్డపై ఎలా ప్రదర్శన ఇస్తుందనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా, బీసీసీఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Details

స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌గా అడ్రియన్ లే రౌక్స్‌

ఇప్పటి వరకు స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సోహమ్‌ దేశాయ్‌ను తప్పించి, దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లే రౌక్స్‌ (Adrian le Roux)ను కొత్తగా నియమించింది. ప్రస్తుతం లే రౌక్స్‌ ఇంగ్లాండ్‌లో ఉన్న టీమిండియా స్క్వాడ్‌తో కలిశారు. ఆటగాళ్లతో కలిసి ఫిట్‌నెస్‌ సెషన్లను ప్రారంభించారు. అడ్రియన్‌ లే రౌక్స్‌కు ఈ రంగంలో అపార అనుభవం ఉంది. ఇప్పటికే 2002 జనవరి నుంచి 2003 మే వరకు భారత జట్టులో స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌గా పని చేశారు.

Details

ఐపీఎల్ లో ఆరేళ్ల పాటు సేవలు

అంతేకాదు, ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌కు గత ఆరేళ్ల పాటు సేవలందించారు. ఆటగాళ్లకు ప్రత్యేకమైన వ్యాయామ పద్ధతులు, న్యూట్రిషన్‌ మార్గదర్శకాలు అందిస్తూ మంచి ఫలితాలు సాధించారు. పంజాబ్‌ టీమ్‌ ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరడం వెనక లే రౌక్స్‌ కృషి ఒక కారణంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి టీమిండియా బాధ్యతలు అప్పగించారు. యువ ఆటగాళ్లతో కూడిన కొత్త జట్టుకు ఆయన అనుభవం ఎంతగానో ఉపయోగపడనుంది.