
Asia Cup: ఆసియా కప్‌కు ముందు టీమిండియా సపోర్టు స్టాప్‌లో కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఒకవైపు కొత్త సెలక్షన్ కమిటీ సభ్యులను నియమించేందుకు సన్నాహాలు చేస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. మరోవైపు జట్టుతో దీర్ఘకాలంగా ఉన్న సపోర్ట్ స్టాఫ్‌లోని కొందరిని పక్కన పెడుతోంది. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న వేళ బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సూచనలతో దాదాపు 15 ఏళ్లుగా జట్టుతో ఉన్న మసాజ్ థెరపిస్ట్ రాజీవ్‌కుమార్‌ను బీసీసీఐ తప్పించింది. అతని పదవీకాలాన్ని ఇకపై పొడిగించకూడదని నిర్ణయం తీసుకుంది.
Details
దిలీప్ కు మరోసారి అవకాశం
క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం..ఇప్పటికే కొత్త మసాజర్‌ను జట్టు మేనేజ్‌మెంట్ సిఫారసుతో బోర్డు నియమించిందని తెలుస్తోంది. జట్టుతో సహాయక సిబ్బంది చాలాకాలం కొనసాగితే అంచనాలకు తగ్గ ఫలితాలు రాకపోవచ్చని బీసీసీఐలోని కీలక సభ్యులు భావించినట్లు పీటీఐ కథనం వెల్లడించింది. అయితే రాజీవ్ జట్టుతో గాఢమైన అనుబంధం కలిగి ఉన్నాడని, ముఖ్యంగా పేసర్లకు మంచి మద్దతుగా నిలిచాడని చెబుతారు. ఆటగాళ్లతో స్నేహపూర్వకంగా ఉండే అతను, ఇటీవల షమీ చేసిన సోషల్ మీడియా పోస్టుతో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు. గతంలో కూడా మరో మసాజ్ థెరపిస్ట్ అరున్ కనడేను బీసీసీఐ పక్కన పెట్టిన విషయం తెలిసిందే. అదేవిధంగా, ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌ను తొలగించాలన్న నిర్ణయం తీసుకున్నప్పటికీ, చివరికి యూటర్న్ తీసుకొని అతనికి మరోసారి అవకాశం ఇచ్చింది.
Details
ప్రస్తుతం భారత జట్టు కోచింగ్, సపోర్ట్ స్టాఫ్
ప్రధాన కోచ్: గౌతమ్ గంభీర్ అసిస్టెంట్ కోచ్: రియాన్ టెన్ డస్కతే బ్యాటింగ్ కోచ్: సితాన్షు కోటక్ బౌలింగ్ కోచ్: మోర్నీ మోర్కెల్ త్రో డౌన్ స్పెషలిస్ట్: రాఘవేంద్ర ద్వివేది లాజిస్టిక్స్ మేనేజర్: ఉపాధ్యాయ వీడియో ఎనలిస్ట్: హరి స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్: ఆడ్రియన్ లె రౌక్స్ ఫీల్డింగ్ కోచ్: దిలీప్