WPL 2023 : ఐదు వికెట్లతో చెలరేగిన కిమ్ గార్త్
మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ చేతిలో పరాజయం పాలైంది. మొదటి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయిన గుజరాత్.. రెండో మ్యాచ్ లో యూపీ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. గుజరాత్ జెయింట్స్ తరుపున కిమ్ గార్త్ ఐదు వికెట్లతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది. 170 పరుగుల లక్ష్య చేధనకు దిగిన యూపీ వారియర్స్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ అలిస్సా హీలీ (7), శ్వేతా సెహ్రావత్ (5) ని కిమ్ గార్త్ ఔట్ చేసింది. అయితే మెక్ గ్రాత్ ను (0) డకౌట్ చేసి యూపీని కిమ్ గార్త్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. యూపీలో 53 పరుగులతో దూకుడుగా ఆడుతున్న కిరణ్‌ను కిమ్ గార్త్ పెవిలియన్‌కు చేర్చింది.
కిమ్‌గార్త్ సాధించిన రికార్డులివే
గార్త్ ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఏప్రిల్ 25, 1996న జన్మించాడు. ఆమె వన్డేలో 2010లో అరంగేట్రం చేసింది. గతేడాది డిసెంబర్‌లో భారత టీ20 పర్యటన భాగంగా ఆస్ట్రేలియా తరుపున క్యాప్‌ను అందుకుంది. గార్త్ 54 ఉమెన్స్ టీ20లో 23.09 సగటుతో 762 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ విభాగంలో 43 వికెట్లను పడగొట్టింది. వన్డేల్లో 36 మ్యాచ్‌లు ఆడి 450 పరుగులు చేసింది. బౌలింగ్‌లో 23 వికెట్లు సాధించింది. ఆస్ట్రేలియా తరుపున ఆమె ఇప్పటివరకు రెండు వన్డేలు, మూడు టీ20లను మాత్రమే ఆడింది. వెస్టిండీస్ స్టార్ ఆల్-రౌండర్ డియాండ్రా డాటిన్ గాయం కారణంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో గార్త్ ఎంపికైంది.