LOADING...
IPL 2025: ఐపీఎల్ 2025 కోసం KKR న్యూజెర్సీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఐపీఎల్ 2025 కోసం KKR న్యూజెర్సీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

IPL 2025: ఐపీఎల్ 2025 కోసం KKR న్యూజెర్సీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన టీ20 క్రికెట్ మహోత్సవం ఐపీఎల్-2025 (IPL-2025) రాబోతోంది. ఇప్పటికే నిర్వాహకులు షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ (IPL) జరగనుంది. మొత్తం 13 ప్రధాన స్టేడియాల్లో 74 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో తలపడనుంది. తొలి మ్యాచ్‌తో పాటు గ్రాండ్ ఫైనల్ కూడా ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) మైదానంలోనే జరుగుతుంది.

వివరాలు 

జెర్సీ లాంచ్ వీడియో

ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 సీజన్‌కు ముందుగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన జెర్సీ లాంచ్ వీడియోను సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కేకేఆర్ ఆటగాళ్లు రహానే (Rahane), వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer), రింకూ సింగ్ (Rinku Singh) కొత్త జెర్సీని ధరించి కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

KKR చేసిన ట్వీట్