షకీబ్ అల్ హసన్ ప్లేస్‌లో జాసన్ రాయ్‌ను తీసుకున్న కేకేఆర్
కోల్ కతా జట్టు ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఐపీఎస్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. సొంత దేశం తరుపున ఆడేందుకు అతను ఐపీఎల్ కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో కోల్ కతా నైట్ రైడర్స్ కొత్త ఆటగాడిని ఎంపిక చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ ని షకీబ్ ప్లేస్‌లో కోల్ కతా యాజమాన్యం రీప్లేస్ చేసింది. రూ.2.8 కోట్లకు అతడిని కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. 2021లో ఐపీఎల్ ఆడిన జాసన్ రాయ్ సన్ రైజర్స్ తరుపున ఆడిన విషయం తెలిసిందే. అంతకుముందు కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ లయన్స్ తరుపున ఆడాడు.
ఐపీఎల్‌లో రెండు అర్ధ సెంచరీలు చేసిన జాసన్ రాయ్
ఇప్పటివరకూ 64 టీ20లు ఆడిన రాయ్ 1522 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది అర్ధ సెంచరీలున్నాయి. ఐపీఎల్‌లో 13 మ్యాచ్ లు ఆడిన రాయ్ 129 స్ట్రైక్ రేట్ తో 329 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలున్నాయి. కాగా గతేడాది మినీ వేలంలో షకీబ్ అల్ హాసన్‌ను కేకేఆర్ యాజమాన్యం రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో కేకేఆర్ పంజాజ్ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడిపోయిన తెలిసిందే. ఏప్రిల్ 6న కేకేఆర్, బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్‌తో తలపడనుంది.