పాయింట్ల పట్టికలో దుమ్ములేపిన కేకేఆర్.. ఆరెంజ్, పర్పూల్ క్యాప్ వీరికే!
పాయింట్ల పట్టికల్లో కేకేఆర్ రెండుస్థానంలోకి దూసుకెళ్లింది. వరుసగా రెండు సంచలన విజయాలతో కేకేఆర్ మంచి జోష్ మీద ఉంది. ఆదివారం డబుల్ హెడర్ కాగా.. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై కోల్ కతా విజయం సాధించింది. ప్రస్తుతం తొలి స్థానంలో రాజస్థాన్ మూడు మ్యాచ్ లు ఆడి, రెండిట్లో నెగ్గింది. ఆ టీమ్ నెట్ రన్‌రేట్ 2.067గా ఉంది. టాప్ సిక్సలో ఉన్న అన్ని టీమ్స్ రెండు విజయాలు సాధించినా రాజస్థాన్ రాయల్స్ రన్ రేట్ అందరి కన్నా ఎక్కువ ఉండటంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక కేకేఆర్ రెండు వరుస విజయాలతో 1.375 నెట్ రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉండడం విశేషం.
ఆరెంజ్ క్యాప్ వీరుడు శిఖర్ ధావన్
ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానంలో, రెండింట్లో ఓడిన ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో ఉంది. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ సన్ రైజర్స్ జరిగిన మ్యాచ్ లో 99 రన్స్ చేశాడు. దీంతో అతడు ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో ధావన్ మూడు మ్యాచ్ లు ఆడి 225 పరుగులు చేశాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ 189, వార్నర్ 158 పరుగులతో ధావన్ తర్వాతి స్థానంలో నిలిచారు. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ రషీద్ కేకేఆర్ హ్యాట్రిక్ వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. రషీద్ ఆడిన మూడు మ్యాచ్‌లో 8 వికెట్లను పడగొట్టాడు.