LOADING...
KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్
ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్

KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2025
09:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ (DC vs GT) జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ అద్భుత శతకంతో మెరిశాడు. అతను 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో అజేయంగా 112 పరుగులు చేసి కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించాడు. ఈ శతకం ద్వారా రాహుల్ ఈ సీజన్‌లో సెంచరీ సాధించిన తొలి కుడిచేతి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇది ఐపీఎల్‌లో అతనికిది ఐదో శతకం కావడం విశేషం.

Details

కోహ్లీని దాటేసిన కేఎల్ రాహుల్

ఇతర బ్యాటర్ల ప్రదర్శనలో అభిషేక్‌ పోరెల్‌ 30 పరుగులు చేయగా, అక్షర్‌ పటేల్‌ 25, ట్రిస్టన్‌ స్టబ్స్‌ 21 పరుగులతో మద్దతుగా నిలిచారు. డుప్లెసిస్‌ 5 పరుగులు మాత్రమే చేశారు. గుజరాత్‌ బౌలింగ్ విభాగంలో అర్షద్‌ ఖాన్‌, సాయి కిశోర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ తలో వికెట్‌ తీశారు. అంతేకాకుండా, ఈ ఇన్నింగ్స్‌లో రాహుల్ టీ-20 ఫార్మాట్‌లో వేగవంతంగా 8,000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కోహ్లీ ఈ మైలురాయిని 243 ఇన్నింగ్స్‌లలో చేరుకోగా, రాహుల్ మాత్రం కేవలం 224 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్