LOADING...
IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ నియామకం
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ నియామకం

IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ నియామకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ నవంబర్ 26తో ముగియనుంది. అనంతరం నవంబర్ 30 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత సెలెక్షన్ కమిటీ వన్డే జట్టును ప్రకటించింది. సఫారీలతో జరిగిన తొలి టెస్టులో మెడ నొప్పి కారణంగా మైదానాన్ని విడిచి వెళ్లిన శుభ్‌మన్ గిల్‌కు ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చారు. అతని స్థానంలో జట్టుకు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు. అలాగే దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో జరిగిన మూడు అనధికార వన్డేల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రుతురాజ్ గైక్వాడ్‌ను కూడా వన్డే జట్టులోకి ఎంపిక చేశారు.

Details

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్‌కీపర్), రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా కుల్‌దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్