LOADING...
KL Rahul-Nitish Rana : రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. ఉక్కిరిబిక్కిరి చేసిన కేఎల్ రాహుల్, నితీష్ రాణా
రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. ఉక్కిరిబిక్కిరి చేసిన కేఎల్ రాహుల్, నితీష్ రాణా

KL Rahul-Nitish Rana : రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. ఉక్కిరిబిక్కిరి చేసిన కేఎల్ రాహుల్, నితీష్ రాణా

వ్రాసిన వారు Moogati Shabari
Apr 25, 2026
09:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టుకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ నిశ్శంక కేవలం 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ రాణాతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు కలిపి 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యాల జాబితాలో ఈ జోడీ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. పవర్‌ప్లే ముగిసే సమయానికి 68 పరుగులు చేసిన వీరు, తర్వాత కేవలం 9 ఓవర్లలోనే 189 పరుగులు రాబట్టడం విశేషం.

వివరాలు

ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్రలోనే వేగవంతమైన 200 పరుగులు..

ఈ దూకుడు బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టు అత్యంత వేగంగా 15.3 ఓవర్లలోనే 200 పరుగుల మైలురాయిని చేరుకుంది. గతంలో ముంబైపై 16.1 ఓవర్లలో సాధించిన రికార్డును ఈ మ్యాచ్‌లో చెరిపేసింది. అలాగే పంజాబ్ కింగ్స్‌పై రెండో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా కూడా రాహుల్-రాణా నిలిచారు.

వివరాలు

పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఢిల్లీ బ్యాటర్లు..

ఢిల్లీ బ్యాటర్ల ధాటికి పంజాబ్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముఖ్యంగా జేవియర్ బార్ట్లెట్ వేసిన ఒక ఓవర్లో నితీష్ 2 సిక్సర్లు, 4 ఫోర్లతో విరుచుకుపడటంతో అతని ఎకానమీ రేటు 17.25కు చేరింది. అర్ష్‌దీప్ 49 పరుగులు ఇచ్చాడు. మార్కో జాన్సెన్ 45, వైశాఖ్ 48 , యుజ్వేంద్ర చాహల్ 42 పరుగులు సమర్పించుకున్నారు. కేఎల్ రాహుల్, నితీష్ రాణా మెరుపు ఇన్నింగ్స్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోర్లలో ఇది అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్ చేసిన 254 పరుగులు, బెంగళూరు సాధించిన 250 పరుగుల రికార్డులను అధిగమిస్తూ ఢిల్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

Advertisement