
KL Rahul : లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోనే కొనసాగనున్న కేఎల్ రాహుల్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వీడతారని జోరుగా వార్తలు వినిపించాయి అయితే రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌ను వదిలిపెట్టే ఉద్దేశ్యం లేనట్లు తెలుస్తోంది.
సోమవారం ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకాను రాహుల్ సోమవారం కలవడం జరగడంతో ఈ ఊహాగానాలకు చెక్ పడింది.
మే 8న సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓడిపోయిన తర్వాత, గోయెంకా రాహుల్ కలవడం ఇదే తొలిసారి.
ఆ మ్యాచులో ఘోర పరాజయం తర్వాత కెప్టెన్ రాహుల్‌తో గోయెంకా కోపంగా మాట్లాడినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Details
గోయెంకాతో కేఎల్ రాహుల్ భేటీ
ఐపీఎల్‌లో లక్నో అశించిన స్థాయిలో రాణించకపోవడంతో రాహుల్ వేరే ఫ్రాంచైజీకి వెళ్తాడనే ఊహాగానాలకు చెక్ పడింది.
తాజా పరిణామాలు చూస్తే లఖ్‌నవూతో రాహుల్ తన సంబంధాన్ని కొనసాగించనున్నట్లు స్పష్టమవుతోంది.
ఇక లక్నో సూపర్ జెయింట్స్ మార్గనిర్దేశకుడిగా భారత జట్టు మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను నియమించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాహుల్-గోయెంకా భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.