World cup T20: వరల్డ్ కప్ టీ 20 టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లకు స్పాన్సర్ గా నందిని డెయిరీ...
త్వరలో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ కు ఐర్లాండ్ (Ireland), స్కాట్లాండ్ (Scotland) క్రికెట్ జట్లకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (Karnatka Milk Federation) స్పాన్సర్ షిప్ ను అందించనుంది. నందిని బ్రాండ్ డైయిరీ(Nandini Brand Dairyగా పేరొందిన ఈ సంస్థ టీ 20 వరల్డ్ కప్ కు స్పాన్సర్ షిప్ ను దక్కించుకుంది. ఈ టీ 20 వరల్డ్ కప్ నకు జూన్ 1 నుంచి 29 వరకు వెస్టిండీస్(Westindies), అమెరికా(America) ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీలో 20 దేశాలకు చెందిన క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి. ''ఈ టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లకు స్పాన్సర్ షిప్ దక్కడం సంతోషంగా ఉంది. ఈ టోర్నీ ద్వారా ఇప్పుడు మా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా తెలియనున్నాయి.
ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కు అమెరికా ఆతిథ్యం
శక్తి నిచ్చే ఎనర్జీ డ్రింక్ లను ఆ రెండు దేశాల జట్లకు సరఫరా చేయనుండటం ఆనందాన్నిస్తోంది.'' అని కేఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంకే జగదీష్ చెప్పారు. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరిగే ఈ టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో తొలి మ్యాచ్ అమెరికా వర్సెస్ కెనడా జట్ల మధ్య జరగనుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కు అమెరికా ఆతిథ్య మివ్వడం ఇదే తొలిసారి. టీ 20 టోర్నీలో భాగంగా అమెరికాలో తొమ్మిది వేదికల్లో 55 మ్యాచ్ లు జరగనున్నాయి. మొత్తానికి ఈ స్పాన్సర్షిప్ ను దక్కించుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించడంతో పాటు దాని దశ కూడా తిరగనుంది.