Paris Olympics : చరిత్రలో మూడుసార్లు ఒలింపిక్ క్రీడలు రద్దు.. కారణమిదే
పారిస్ వేదికగా జులై 26 నుంచి ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి మొత్తం 117 మంది క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఒలింపిక్ క్రీడలు ప్రారంభం నుంచి ఇప్పటివరకూ మూడుసార్లు వాయిదా పడ్డాయి. అయితే ఆ ఈవెంట్స్ ఎందుకు రద్దు అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రద్దు
సమ్మర్ ఒలింపిక్స్ ఆరో ఎడిషన్ జర్మనీ రాజధాని బెర్లిన్ వేదికగా జరగాల్సి ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1916లో ఆ ఈవెంట్ జరగలేదు. అయితే రెండు దశాబ్దాల తర్వాత 1936లో మళ్లీ బెర్లిన్ వేదికగా ఒలింపిక్ క్రీడలను విజయవంతంగా నిర్వహించారు.
కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా
1940లో టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ కూడా రద్దయ్యాయి. దీనికి ముఖ్య కారణం రెండోవ ప్రపంచ యుద్ధం. ఇక రెండోవ ప్రపంచ యుద్ధం కారణంగా 1944లో లండన్‌లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలను రద్దు చేశారు. మరోవైపు కరోనా కారణంగా టోక్యోలో 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలను ఏడాది పాటు వాయిదా వేశారు. చివరికి ఆ క్రీడలను జూలై 23, 2021 నుండి ఆగస్టు 8, 2021 వరకు విజయవంతంగా నిర్వహించారు.