Page Loader
Virat Kohli:ఎయిర్ పోర్టులో మహిళకు కోహ్లీ హగ్.. ఆ అదృష్టవంతురాలు ఎవరంటే?
ఎయిర్ పోర్టులో మహిళకు కోహ్లీ హగ్.. ఆ అదృష్టవంతురాలు ఎవరంటే?

Virat Kohli:ఎయిర్ పోర్టులో మహిళకు కోహ్లీ హగ్.. ఆ అదృష్టవంతురాలు ఎవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2025
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాటింగ్‌లో ఇటీవలి కాలంలో మెరిసిపోకపోయినా, కోహ్లీ క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. స్టేడియాల్లో అభిమానులు అతన్ని చూడటానికి పోటెత్తుతుండటం సాధారణమే. రంజీ ట్రోఫీలో కోహ్లీ ఆడిన మ్యాచ్‌కు కూడా భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అంతేకాదు ఇంగ్లాండ్‌తో కటక్‌లో జరిగిన రెండో వన్డేకు ముందు అతను ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నప్పుడు కూడా అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. కోహ్లీ బయట కనిపిస్తే అతడితో షేక్‌హ్యాండ్ చేసుకోవడానికి ఫ్యాన్స్ ఎగబడతారు. అయితే, తాజాగా కోహ్లీ స్వయంగా ఓ మహిళ దగ్గరకు వెళ్లి హగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Details

కోహ్లీ దగ్గరి బంధువుగా సమాచారం

ఈ ఘటన భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. విమానాశ్రయంలో చెకింగ్ ఏరియాకు ముందు కొంతమంది అభిమానులు భారత క్రికెటర్లను చూడటానికి నిలబడ్డారు. అటువైపు వచ్చిన కోహ్లీ ఆ గుంపులో ఓ మహిళను చూసి నవ్వుతూ దగ్గరకు వెళ్లి హగ్ ఇచ్చాడు. కొందరు ఫ్యాన్స్ కోహ్లీతో షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది అతన్ని అక్కడి నుంచి పంపించారు. ఈ దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇదంతా చూసిన ఫ్యాన్స్ ఆ మహిళ ఎవరు? కోహ్లీ ఎందుకు హగ్ చేసుకున్నాడు? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఆమె కోహ్లీకి దగ్గరి బంధువు అనే సమాచారం ఉంది. అందుకే అతను స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లి హగ్ ఇచ్చాడని చెబుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో