Page Loader
Virat Kohli : బ్రిస్బేన్ టెస్టులో కోహ్లీ చేతులెత్తేశాడు.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్
బ్రిస్బేన్ టెస్టులో కోహ్లీ చేతులెత్తేశాడు.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్

Virat Kohli : బ్రిస్బేన్ టెస్టులో కోహ్లీ చేతులెత్తేశాడు.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2024
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బ్రిస్బేన్ టెస్టులో విరాట్ కోహ్లీ అంచనాలకు మించి రాణించలేకపోయారు. ఇంతకుముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్‌కు చుక్కలు చూపించిన కోహ్లీ, ఈ సీజన్‌లో మాత్రం పూర్తిగా ఫామ్‌ కోల్పోయి నిరాశపరిచాడు. బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులకే ఔటవ్వడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్‌ను కోల్పోయిన కోహ్లీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇటీవల పెర్త్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి అభిమానుల్లో ఆశలను రేపాడు. కానీ ఆ తర్వాత అడిలైడ్ టెస్టులో మరోసారి నిరాశపరిచాడు. తాజాగా బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు.

Details

ధోనిని చూసి నేర్చుకో

కోహ్లీ ప్రదర్శనపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ధోనీని చూసి నేర్చుకుని టెస్ట్ క్రికెట్‌కు రిటైర్ అవ్వాలని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు భారత క్రికెట్‌కు సేవ చేసిన కోహ్లీ ఇప్పుడు సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిస్బేన్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయగా, టీమిండియా బ్యాటింగ్‌లో తడబడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 51 పరుగులు చేసింది. కోహ్లీతో పాటు జైస్వాల్, గిల్, పంత్ వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు ఒత్తిడిలో పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లీ తన ఫామ్‌ను తిరిగి పొందాలన్న అభిమానులు కోరుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఎలా ఆడతాడనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.