
'కోహ్లీ రివ్యూ సిస్టమ్' సూపర్.. మైదానంలో పక్కా వ్యూహాలు
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ కి విరాట్ కోహ్లీ కెప్టెన్ వ్యవహరించిన విషయం తెలిసిందే.
మైదానంలో తన వ్యూహాలను రచించి జట్టుకు అదిరిపోయే విజయాన్ని అందించాడు.
పెద్దగా అంచనాలు లేని చోట రివ్యూ తీసుకొని సానుకూల ఫలితం పొంది అందరిచేత శబాష్ అనిపించుకున్నాడు.
అందరికీ ధోని రివ్యూ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలుసు. అతడు రివ్యూ తీసుకున్నాడంటే ఫలితం అతనికి అనుకూలంగా రావాల్సిందే.
అయితే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కూడా అలాగే కనిపించాడు. సహాచర ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ.. తనదైన వ్యూహాలతో కోహ్లీ ముందుకెళ్లాడు.
Details
సోషల్ మీడియాలో కోహ్లీపై ప్రశంసలు
గాయం కారణంగా కెప్టెన్ డుప్లెసిస్ పంజాబ్ మ్యాచ్ లో కేవలం బ్యాటింగ్ కు మాత్రమే దిగాడు.
ఈ క్రమంలో కెప్టెన్సీగా బాధ్యతలు చేపట్టిన కోహ్లీ.. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో పంజాబ్ ఓపెనర్ అథర్వ(4) ఎల్బీగా వెనుతిరిగాడు.
అయితే సిరాజ్ అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో వెంటనే డీఆర్ ఎస్ కి వెళ్లాడు. ఫలితం అనుకూలంగా రావడంతో కోహ్లీ తనదైన స్టైల్ లో మైదానంలో సంబరాలు చేసుకున్నాడు.
లివింగ్ స్టోన్ పై మరోసారి డీఆర్ఎస్ కోరాడు. ఇది కూడా సానుకూలంగా రావడంతో కెప్టెన్ కోహ్లీ ఫైర్ లోకి వచ్చాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు. 'ఇది డీఎస్ఆర్ కాదు కేఆర్ఎస్' అంటూ నెజిజన్లు కామెంట్లు పెడుతున్నారు.