Loading...
PV Sindhu: జపాన్ ఓపెన్ టైటిల్ వెనుక కోహ్లీ సపోర్ట్.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన పీవీ సింధు
జపాన్ ఓపెన్ టైటిల్ వెనుక కోహ్లీ సపోర్ట్.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన పీవీ సింధు

PV Sindhu: జపాన్ ఓపెన్ టైటిల్ వెనుక కోహ్లీ సపోర్ట్.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన పీవీ సింధు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ షట్లర్ పివి.సింధు ఎట్టకేలకు మరోసారి తన సత్తాను ప్రపంచానికి చాటింది. మేజర్ టైటిల్‌ను కైవసం చేసుకుంటూ జపాన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్‌ సూపర్ 750 టోర్నమెంట్‌లో చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నంబర్-3 షట్లర్ అకానే యమగూచిపై అద్భుత ప్రదర్శన కనబరిచిన సింధు 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా షట్లర్‌గా ఆమె కొత్త చరిత్ర లిఖించింది. 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన తర్వాత సింధుకు ఇదే తొలి మేజర్ బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్ కావడం విశేషం. కొన్నేళ్లుగా గాయాలు, ఫామ్‌లేమితో తీవ్ర ఇబ్బందులను ఆమె ఎదుర్కొంది.

వివరాలు

కోహ్లీ చెప్పిన ప్రతి మాట నా మదిలో నిలిచిపోయింది

ఈ విజయంతో ఘనంగా పునరాగమనం చేసినట్లు నిరూపించింది. ఈ విజయానంతరం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిన ఒక ప్రత్యేకమైన విషయాన్ని కూడా సింధు అభిమానులతో పంచుకుంది.

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో జరిగిన ఓ వ్యక్తిగత సంభాషణ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని సింధు వెల్లడించింది. మా మధ్య ఏం మాట్లాడుకున్నామనేది మా ఇద్దరి మధ్యే ఉంటుంది.

కానీ నాకు అవసరమైన సమయంలో ఆయన అండగా నిలిచారు. ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. అయితే చెప్పిన ప్రతి మాట నా మదిలో బలంగా నిలిచిపోయింది.

కొన్ని సంభాషణలు మన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేస్తాయి. నాకైతే ఇది అలాంటి సంభాషణేనని సింధు తెలిపింది.

ADVERTISEMENT