Virat Kohli: భారత ఆటగాళ్లు కోహ్లీ వార్నింగ్.. ప్రపంచ కప్‌లో చిన్న జట్లు ఉండవంటూ హెచ్చరిక
వన్డే వరల్డ్ కప్ 2023లో పసికూనలైన ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ జట్టు సంచనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. గత ఆదివారం డిల్లీలో జరిగిన మ్యాచులో ఢిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టును ఆఫ్గాన్ జట్టు 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మరోవైపు బుధవారం ధర్మశాలలో జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తో ఇవాళ టీమిండియా మ్యాచ్ జరగనున్న తరుణంలో జట్టు సభ్యులకు విరాట్ కోహ్లీ హెచ్చరికలు జారీ చేశాడు. ప్రపంచ కప్‌లో చిన్న జట్లు ఉండవని, కేవలం బలమైన జట్లపైనే దృష్టి సారిస్తే నిరాశ తప్పదని కోహ్లీ పేర్కొన్నారు.
షకీబ్ పై కోహ్లీ ప్రశంసలు
అనంతరం షకీబ్ పై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. షకీబ్ కు పోటీగా తాను చాలా క్రికెట్ ఆడానని, అతనికి ఎంతో ఎక్సీ పీరియన్స్ ఉందని కోహ్లీ చెప్పాడు. కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని, బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో షకీబ్ దిట్ట అని తెలిపాడు. మరోవైపు కోహ్లీ వ్యాఖ్యలను హార్దిక్ పాండ్యా సమర్థించాడు. షకీబ్ కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ జట్టును తన భూజాలపై మోస్తున్నాడని కొనియాడారు. ఈ అధునాతన క్రికెట్ యుగంలో కోహ్లీ బెస్ట్ బ్యాటర్ అని షకీబ్ ప్రశంసించాడు.