ఫీల్డింగ్ సెట్ చేయడంలో ధోనీ మాస్టర్ మైండ్; వెంకటేష్ అయ్యర్ ప్రశంసలు
భారత క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి ధోనీ రిటైరైనా ఐపీఎల్‌లో సీఎస్కే తరపున ఆడుతూ అభిమానులను అలరిస్తూ ఉన్నాడు. కెప్టెన్ కూల్ అని పేరు తెచ్చుకున్న ధోనీ మాస్టర్ మైండ్ గురించి క్రికెట్ అభిమానులు గొప్పగా చెబుతుంటారు. తాజాగా ఒక క్రికెటర్ ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఐపీఎల్‌లో కోల్‌కతా తరపున ఆడే వెంకటేష్ అయ్యర్, ధోనీ ఫీల్డింగ్ సెట్ చేయడంపై ప్రశంసలు కురిపించాడు. ఈ విషయమై ఒక అనుభవాన్ని పంచుకున్నాడు. ఒకసారి తాను, మరొక ప్లేయర్ క్రీజులో ఉండగా ధోనీ మాస్టర్ మైండ్ అర్థమయ్యిందని అన్నాడు.
ఫీల్డింగ్ సెట్ చేసిన తర్వాతి బంతికే ఔట్
తాను నాన్ స్ట్రైకర్ లో ఉన్నప్పుడు ఫీల్డింగ్‌ని ధోనీ మార్చాడట. స్ట్రైకర్ కోసం కవర్స్, థర్డ్ మ్యాన్ వద్ద ఇద్దరు ఫీల్డర్లను ఉంచాడట. బౌలింగ్ వేయడానికి బౌలర్ రెడీ అవుతుండగా, మరోమారు మరో ఫీల్డర్‌ని రమ్మని చెప్పి ఒక ప్లేస్ లోఉండమని చెప్పాడట. అలా సెట్ చేయగానే, బ్యాటర్ కొట్టిన బంతి, కరెక్టుగా చివర్లో ధోనీ సెట్ చేసిన ఫీల్డర్ చేతుల్లోకే వెళ్ళిందట. దాంతో ఒక్కసారిగా వెంకటేష్ షాకయ్యాడట. అసలు అలా ఎందుకు జరిగిందో అతని ఏమీ అర్థం కాలేదట. ఫీల్డింగ్ సెట్ చేసిన తర్వాతి మూడు నాలుగు బంతులు కుడా ఆడకుండా ఎగ్జాక్ట్ గా తర్వాతి బంతికి ఔటవ్వడంతో ధోనీ మాస్టర్ మైండ్ అర్థమయ్యిందని చెప్పుకొచ్చాడు.